మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (18:31 IST)

జైలర్‌గా రాబోతున్న సూపర్ స్టార్.. పోస్టర్ రిలీజ్

Jailer
Jailer
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్‌గా రాబోతున్నారు. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. టాలెంటెడ్ డైరెక్టర్‌‌ నెల్సన్ దిలీప్ కుమార్‌‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి జైలర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.
 
తలైవా 169 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. పవర్‌‌ఫుల్‌ టైటిల్‌కు తగినట్టుగానే పోస్టర్‌‌ను కూడా అంతే పవర్‌‌ఫుల్‌గా డిజైన్ చేశారు. 
 
రక్తంతో తడిసిన పెద్ద కత్తి వేలాడుతున్నట్టుగా పోస్టర్‌‌లో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రజినీకాంత్‌ రేంజ్‌కు సరిపడా హిట్‌ లేకపోవడంతో అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు.
 
ఈ సినిమా టైటిల్, పోస్టర్ చూస్తుంటే సూపర్‌‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఈ సినిమా మంచి ఫీస్ట్‌ అనేలా ఉంది. జైలులోని ఖైదీల మధ్య జరిగే కథ అనే టాక్‌ వినిపిస్తోంది. 
 
జైలర్‌‌ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, రజినీకాంత్‌ పక్కన ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. 
 
రజినీ, ఐశ్వర్యారాయ్‌ జంటగా రోబో సినిమాలో నటించారు. అయితే జైలర్‌‌ సినిమాలో ఐశ్వర్యారాయ్‌ హీరోయిన్‌గా నటిస్తుందా లేదా అనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.