బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (19:03 IST)

మహేష్ బాబు అయితేనేం.. అలాంటి రోల్ చేయను.. శ్రీలీల

sree leela
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు స్టాంపుతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీలీల. తాజాగా మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. 
 
అలాగే, మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరి అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా నటుస్తుంది. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. 
 
అంతేకాదు, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీలను ఎంపిక చేసుకున్నారట.
 
మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసినందుకు శ్రీలీల తెలివి కలిగిందే అంటున్నారట. ఆమె కూడా ముందు మహేష్ బాబు సరసన ఓ హీరోయిన్‌గా అనుకొనే ఒప్పుకుందట. కానీ, తీరా త్రివిక్రమ్ అది మహేశ్ బాబుకి మరదలి పాత్ర.. మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అనగానే నో చెప్పిందట. 
 
తెలుగు సినిమాలే కాకుండా కన్నడలో "దుబారి" అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో మరో సినిమా కూడా హీరోయిన్‌గా చేస్తుంది. అయితే, మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసినందుకు శ్రీలీల తెలివి కలిగిందే అంటూ మెచ్చుకుంటున్నారట.