గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (15:49 IST)

పాన్ ఇండియా పాటగా ‘మషూకా’.. రకుల్ స్టెప్స్ అదుర్స్.. ఆ భాషల్లో విడుదల (video)

Rakul
Rakul
పుష్ప చేతుల మీదుగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రైవేట్ సాంగ్ విడుదలైంది. ఈ పాట ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ పాటలో అద్భుతంగా నటించింది. ‘మషూకా’ అనే టైటిల్‌తో ఈ సాంగ్ వీడియో రూపొందింది. ఈ వీడియో సాంగ్‌ని ప్యాన్ ఇండియా మ్యూజిక్ సాంగ్ అని పిలుస్తున్నారు. 
 
ఎందుకంటే, హిందీలో రూపొందిన ఈ వీడియో సాంగ్ తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. దీంతో మషూకా ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రదర్శితమవుతోంది. తెలుగు వెర్షన్‌ని అల్లు అర్జున్ రిలీజ్ చేశాడు. ప్యాన్ ఇండియా మ్యూజిక్ సాంగ్ అంటూ, గట్టిగా ఈ సాంగ్‌ని ప్రచారం చేస్తున్నారు.  
Rakul
Rakul
 
ఇకపోతే.. రకుల్ మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సాంగ్‌లోనూ చాలా బాగా డాన్సులేసింది. స్టెప్పులు కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా వున్నాయ్. అందుకేనేమో  ‘మషూకా’ నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.