గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (16:30 IST)

"పుష్ప" తాజా స్టిల్స్.. కేక.. కేక.. (ఫోటోలు)

Allu Arjun
Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో షూటింగ్ కోసం వచ్చిన అల్లు అర్జున్‌ను కెమెరాలు క్యాప్చర్ చేశాయి.  
 
ది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ అద్భుతమైన విజయంతో ఈ ఏడాది పండగ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 కోసం షూటింగ్ సిద్ధం అవుతోంది.  
Allu Arjun
Allu Arjun
 
తాజాగా స్టైలిష్ స్టార్ హైదరాబాద్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తెరకెక్కిస్తున్న యాడ్ షూట్ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్‌కి వచ్చిన అల్లు అర్జున్ నల్లటి టోపీ ఉన్న ఫంకీ షర్ట్ ధరించి కనిపించాడు. సెట్స్ నుండి తీసిన అల్లు అర్జున్ స్టిల్స్ చూస్తుంటే.. పుష్ప కొత్త ప్రకటనతో సంచలనం సృష్టించబోతున్నాడని తెలిసింది. 
Allu Arjun
Allu Arjun
 
ఎర్రటి జాకెట్, తెల్లటి టీ-షర్టుతో బ్లాక్ జీన్స్ ధరించి, సెట్స్‌లో తెల్లటి బూట్లతో పక్కా డ్రెస్‌కోడ్‌తో కనిపించాడు. అయితే అది షూట్ కోసం బహుశా అతని వేషధారణ అని అందరూ ఊహించారు. 
Allu Arjun
Allu Arjun


అల్లు అర్జున్ చాలా బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ "ది సౌత్ స్వాగ్" అనే మ్యాగజైన్ కవర్‌ పేజీలో కనిపించాడు.