శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (22:54 IST)

కుమార్తెను అలా కాపాడిన తండ్రి... వీడియో వైరల్ (video)

Father
Father
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు. అనుక్షణం రక్షణగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వుంటారు. వారికి హాని కలిగితే విలవిల్లాడిపోతారు. అమ్మాయిలకు తమ తండ్రులతో ఎక్కువ అనుబంధం ఉంటుందనేది వాస్తవం. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 
 
ఈ క్లిప్‌‌లో ఓ బాలిక సైకిల్ పై వేగంగా వస్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే రోడ్డుకు అవతలవైపు ఉన్న ఇనుప స్తంభాన్ని ఢీకొట్టబోతుండగా.. వెంటనే ఆమె తండ్రి చిన్నారిని సురక్షితంగా కాపాడతాడు. 
 
 

 
బాలికను పట్టుకోకపోయుంటే ఆమె తీవ్రమైన ప్రమాదానికి గురయ్యే అవకాశం వుండేది. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.