కామన్వెల్త్ క్రీడల విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్
Prabhas thanks poster
"కామన్వెల్త్ క్రీడల విజేతలందరికీ కంగ్రాట్స్. మీరు సాధించిన విజయాలతో దేశం గర్విస్తోంది. భారత్ కు మెడల్స్ సాధించడంలో మీరు చూపించిన పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి" అంటూ థాంక్స్ నోట్ పోస్ట్ చేశారు.
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దేశంలో ఏ ప్రాంతం వారికైనా ఆయన బాహుబలిగా అభిమాన హీరో అయ్యారు. ఈ ఇమేజ్ కు అనుగుణంగానే ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, స్పిరిట్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.
