సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (15:56 IST)

కామన్వెల్త్ గేమ్స్‌: స్వర్ణంతో చరిత్ర సృష్టించిన పీవీ సింధు

PV Sindhu
PV Sindhu
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మెరిసింది. సింగిల్స్ విభాగంలో అందని ద్రాక్షలా ఊరిస్తోన్న స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది పీవీ సింధు. 
 
ప్రస్తుతం జరుగుతోన్న బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా సోమవారం మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో సింధు 21-15, 21-13తో మిచెల్ లీ (కెనడా)పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ గతంలో 10 సార్లు తలపడగా 8 విజయాలతో సింధూదే పైచేయి కావడం గమనార్హం
 
ప్రపంచ చాంపియన్‌తో పాటు డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. 2014లో జరిగిన కామన్వెల్త్ లో సింధు కాంస్యాన్ని అందుకోగా.. గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించింది.