బుధవారం, 6 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (08:46 IST)

కామన్వెల్త్ క్రీడలు - పారా పవర్‌లిఫ్టింగ్‌లో సుధీర్‌కు బంగారు

sudheer
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు మరో బంగారు పతకం వచ్చింది. ఈ విభాగంలో సుధీర్ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.
 
ఆసియా పారా ఒలింపిక్స్ కాంస్య విజేత అయిన 27 యేళ్ల సుధీర్ కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీల బరువునెత్తిన సుధీర్.. రెండో ప్రయత్నంలో 212 కిలోల బరువును అలవోకగా ఎత్తిపడేశాడు. 
 
దీంతో ఆయన ఏకంగా 134.5 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచాడు. ఫలితంగా పురుషులు హెవీ హెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సుధీర్‌కు బంగారు పతకం లభించింది.