మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (17:00 IST)

కామన్వెల్త్ క్రీడలు - భారత్ ఖాతాలో ఐదు స్వర్ణాలు

gold medal trio
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ క్రీడారాలు మంచి ప్రతిభను కనపరుస్తున్నారు. ఓవరాల్‌గా 18 పతకాలు సాధించారు. వీటిలో ఐదు బంగారు పతకాలు, ఆరు రజతం, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే, బంగారు పతకాల పట్టికలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. 
 
గురువారం పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్‌లో మహమ్మద్ అనీస్, శ్రీశంకర్‌ పతకం కోసం బరిలోకి దిగుతున్నారు. బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో పతకాల పంట పండుతోంది. ఈ క్రమంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు సాధించిన లిఫ్టర్లు తమ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. 
 
మీరాబాయి చాను, జెరెమీ లాల్రినుంగా, ఆచింత సూయిలీ వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో మీరాబాయి చాను తన సోషల్‌ మీడియా ట్విటర్‌లో ముగ్గురు కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. 'ది గోల్డెన్‌ ట్రయో' అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున స్పందించారు. 41 వేలకుపైగా లైకులు, రెండువేల వరకు రిట్వీట్‌లు వచ్చాయి.