మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (13:34 IST)

బేబీ బంప్‌తో కెమెరా కంటపడిన అలియా భట్

Alia Bhatt
Alia Bhatt
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బేబీ బంప్‌తో తొలిసారిగా కెమెరా కంటపడింది. ఇటీవలే డార్లింగ్స్ సినిమాతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరో హిట్ అందుకోవడానికి రెడీ అవుతోంది.
 
రణబీర్ కపూర్, అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్దమవుతున్న వేళ అలియా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. అయితే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం విదితమే. అయినా కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా భర్తతో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొనడం విశేషం.  
 
ఇక ఎట్టకేలకు బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌లో అలియా బేబీ బంప్‌తో కనిపించింది. పింక్ కలర్ టాప్‌లో అలియా బేబీ బంప్‌తో ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం ఈ కపుల్స్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే పాన్ ఇండియా సినిమాగా బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.