శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (10:09 IST)

బ్రహ్మాస్త్రాన్ని ప్రమోట్ కోసం క్యాష్ గేమ్ షోలో రణబీర్ కపూర్, అలియా భట్, రాజమౌళి

Suma- Rajamouli
Suma- Rajamouli
రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ల బ్రహ్మాస్త్రా భారతదేశం అత్యంత ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. మూడు భాగాలుగా రూపొందించబడిన మొదటి భాగం, బ్రహ్మాస్త్ర: మొదటి భాగం-శివ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించాయి. వేక్ అప్ సిద్., యే జవానీ హై దీవానీ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
 
దక్షిణాదిలో, భారతదేశపు అగ్రశ్రేణి చిత్రనిర్మాత, SS రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అంతేకాక‌  తెలుగు విడుదల కోసం విస్తృతమైన ప్రమోషన్లను ప్లాన్ చేశాడు. అందులో భాగంగా తెలుగు టెలివిజన్ యొక్క అతిపెద్ద రియాలిటీ గేమ్ షో CASHలో బ్రహ్మాస్త్ర ప్రచారం చేయబడుతుంది. ఐకానిక్ షోలో బ్రహ్మాస్త్రా బృందం కీలక తారాగణం, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్ మరియు రాజమౌళి స్వయంగా షూటింగ్‌లో పాల్గొన్నారు.
 
Ranbir Kapoor, Alia Bhatt, Rajamouli
Ranbir Kapoor, Alia Bhatt, Rajamouli
ఈ ప్రమోషనల్ ఎపిసోడ్ షూటింగ్ గత శుక్రవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసింది. స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేసిన, బ్రహ్మాస్త్ర టీమ్ గేమ్ షోను ఆడుతూ చాలా సరదాగా గడిపింది మరియు వారి సినిమా గురించి కీలకమైన అంతర్దృష్టులను కూడా ఇచ్చింది. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రత్యేకంగా నిర్మించిన పూర్తి స్థాయి తెలుగు గేమ్ షోలో ఇంత ప్రముఖ బాలీవుడ్ తారలు పాల్గొనడం ఇదే తొలిసారి.
 
క్యాష్‌పై బ్రహ్మాస్త్ర ప్రమోషన్‌లతో పాటు తారల సరదా బ్యాంటర్లు తెలుగు ప్రేక్షకులకు ట్రీట్‌గా ఉంటాయి. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 10న రాత్రి 9:30 గంటలకు ETVలో ప్రసారం అవుతుంది. బ్రహ్మాస్త్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్,  నాగార్జున అక్కినేని కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.