శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (18:51 IST)

అలియా భట్, రణ్‌బీర్‌కు చేదు అనుభవం..

Alia bhatt
Alia bhatt
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్‌, అలియా భట్‌కు చేదు అనుభవం ఎదురైంది. మహాకాలేశ్వర్ ఆలయాన్ని ఇవాళ సందర్శించాల్సి ఉంది. అయితే దానికి ముందే విశ్వహిందూ, భజరంగ్ దళ్ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల జెండాలతో బాలీవుడ్ జంటకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
 
ఆందోళనకారుల్ని తరిమేందుకు పోలీసులు లాఠీలకు పని పెట్టారు. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్‌లో భాగంగా డైరక్టర్ అయాన్ ముఖర్జీతో కలిసి అలియా, రణ్‌బీర్.. మహాకాలేశ్వర్ ఆలయాన్ని విజిట్ చేయాలనుకున్నారు. 
 
మహాకాలేశ్వరుడి దర్శనం చేసుకోకుండానే ఆలియా, రణ్‌బీర్‌లు ఇండోర్ చేరుకున్నారు. కేవలం దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రమే ఆలయ దర్శనం చేసుకున్నాడు. 
 
బీఫ్ తింటానని గతంలో రణ్‌బీర్ చేసిన కామెంట్ మళ్లీ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భజరంగ్ దళ్ రణ్‌బీర్ రాకను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది.