గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (23:42 IST)

క్రికెట‌ర్ అవ్వాల‌నుకుని హీరో అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Video)

vijaydevakond at uppal
vijaydevakond at uppal
విజ‌య్ దేవ‌ర‌కొండ సెన్సేష‌న‌ల్ స్టార్ అయ్యాడు. లైగ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్‌తో ఆయ‌న ఎక్క‌డికో వెళ్ళిపోయాడు. ఇక ఆయ‌న బిహేవియ‌ర్‌పై ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తూనే వున్నాయి. ఆయ‌న ఏ సినిమా చేసినా హైద‌రాబాద్‌లోని త‌న ఇంటి ద‌గ్గ‌ర‌లో చిన్న పిల్ల‌ల‌తో క్రికెట్ ఆడేవాడు. గీతాగోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు స‌క్సెస్ త‌ర్వాత‌కూడా ఆయ‌న వీధిలో పిల్ల‌ల‌తో ఆట‌లుఆడేవాడు. దానిని అప్ప‌ట్లో మీడియా కూడా వార్త‌లు రాసింది. 
 
లైగ‌ర్ స‌క్సెస్‌తో సంబంధంలేకుండా ఆ త‌ర్వాత విదేశాల్లో క్రికెట్ చూడ‌డానికి హాజ‌ర‌య్యాడు. తాజాగా ఆదివారంనాడు ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ను త‌న స‌న్నిహితుల‌తో తిల‌కించి ఎంజాయ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు సింపుల్‌గా స‌మాధాన‌మిస్తూ, క్రికెట‌ర్ అవ్వాల‌నుకునేవాడిని అంటూ సింపుల్‌గా స‌మాధానం చెప్పి వెళ్ళిపోయాడు. సో. క్రికెట‌ర్ కాబోయే సినిమా క‌థానాయ‌కుడు అయ్యాడ‌న్న‌మాట‌. గ‌తంలో వెంక‌టేష్‌కూడా ఇదే అవ్వాల‌నుకున్నాడు.