ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (12:48 IST)

విజయ్ ఆటిట్యూడ్‌లో తప్పు లేదు కానీ టైమింగ్‌లోనే..?: విజయ్ దేవరకొండ

Liger
విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా లైగర్. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం భారీ ప్లాప్‌గా మిగిలింది. దీనిపై ఆర్జీవీ సంచలన కామెంట్స్ చేశాడు. దీనిపై ఆర్జీవీ అనలైజ్ చేశాడు "నార్త్ వాళ్ళకు సౌత్ స్టార్స్ నచ్చడం వెనుక ఉన్న ప్రధాన కారణం వాళ్ళ నమ్రత. ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ నోట్లో వేలు పెడితే కొరకలేం అన్నంత మంచిగా మాట్లాడారు. వాళ్ళ నమ్రత, నెమ్మదితనం వాళ్లకు చాలా కొత్తగా అనిపించింది. 
 
అప్పటిదాకా ఆటిట్యూడ్ చూపించే బాలీవుడ్ స్టార్స్ కంటే వీళ్ళ ప్రవర్తన ఆకర్షించింది. కానీ విజయ్ దేవరకొండ మళ్ళీ వచ్చి ఇండియాని షేక్ చేస్తా అనడం, వాట్ లగా అనడం, టేబుల్ మీద కాళ్ళు పెట్టడం అవీ బాలీవుడ్ స్టార్స్ లాగానే అనిపించాయి. నిజానికి విజయ్ ఏం మారలేదు. మొదటినుండి అలాగే ఉన్నాడు. 
 
విజయ్‌కి యూత్‌లో క్రేజ్ వుంది. యూత్‌లో రౌడీ ఇమేజ్ తెచ్చింది కూడా ఈ ఆటిట్యూడ్ వల్లే. విజయ్ ఆటిట్యూడ్‌లో తప్పు లేదు కానీ టైమింగ్‌లోనే తప్పుంది. కశ్మీర్ ఫైల్స్ తీసిన వివేక్ అగ్నిహోత్రి విజయ్ కంటే పది రెట్లు ఆటిట్యూడ్‌తో మాట్లాడతాడు కానీ తన సినిమా విజయం సాధించింది కదా, విజయ్ ది కేవలం రాంగ్ టైమింగ్ అంతే అని చెప్పుకొచ్చాడు.