గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 10 సెప్టెంబరు 2022 (16:19 IST)

పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య, కారణం ఏంటంటే?

suicide
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదులోని దుర్గంచెరువులో దూకి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

 
స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసారు. అతడు ఎవరా అని విచారించగా పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసినట్లు తెలిసిందన్నారు. విపరీతమైన అప్పులు, ఆర్థిక కష్టాల కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.