మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (22:51 IST)

బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో దేవసేన.. బాహుబలి గురించి చెప్తుందా?

Anushka,Prabhas
'ఆహా' వారి కోసం బాలయ్య హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్' టాక్ షోలో దేవసేన పాల్గొననుంది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్-2 ని కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది అల్లు అరవింద్ అండ్ టీం. 
 
మొదటి సీజన్లో మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు పాల్గొన్నారు. సెకండ్ సీజన్‌కు కూడా పెద్ద హీరోలను తీసుకురావాలని అల్లు అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
తాజాగా అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. అనుష్కని ఈ షోకి తీసుకురావాలని అరవింద్ గారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఆమె యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరో.
 
ఒకవేళ ఈ షోలో కనుక అనుష్క పాల్గొంటే ఆమెకు ప్రభాస్‌తో రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.