గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (09:36 IST)

ఆ ప్రాజెక్టు గురించి మరిచిపోండి... 'సైమా'ను ఎంజాయ్ చేయండి : హీరో విజయ్ దేవరకొండ

vijay devarakonda
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "లైగర్". బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత పూరీ, చార్మీ కౌర్‌లు నిర్మించారు. ఆగస్టు 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చింది. 
 
'లైగర్‌' సినిమా విడుదలకు ముందే విజయ్‌ దేవరకొండతో తన కలల ప్రాజెక్టు 'జనగణమన' ప్రారంభిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ప్రకటించారు. చిన్న షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. 
 
కానీ "లైగర్‌" బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దర్శక, నిర్మాతలు 'జనగణమన'పై ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. ఈ ప్రాజెక్టుకి నిర్మాతలుగా వ్యవహరించిన పూరీ జగన్నాథ్‌, ఛార్మీలు సైతం 'జనగణమన'పై ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కనీసం 'జనగణమన' ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలనూ ఖండించట్లేదు. 
 
తాజాగా నటుడు విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా సైమా వేడుకకు హాజరై ఇతడిని అక్కడి మీడియా 'జనగణమన' గురించి ప్రశ్నించగా... 'ఇక్కడికి ప్రతీ ఒక్కరు వేడుకను ఎంజాయ్‌ చేయడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోండి.. సైమాను ఎంజాయ్‌ చేయండి' అంటూ సమాధానమిచ్చాడు.