బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (10:53 IST)

శివ ఏడుస్తుంటే బ్రదర్ ఫీలింగ్ వ‌చ్చిందిః .విజయ దేవరకొండ

Sivakarthikeyan, Vijay Devarakonda, anudeep
Sivakarthikeyan, Vijay Devarakonda, anudeep
శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక నటిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా స్టార్ విజయ దేవరకొండ, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిధులుగా ఈ వేడుకకు హాజరయ్యారు.
 
శివకార్తికేయన్ మాట్లాడుతూ..'ప్రిన్స్ చిత్రాన్ని గొప్పగా నిర్మించి దీపావళికి గ్రాండ్ గా విడుదల చేసి ప్రేక్షకులకు వినోదం పంచబోతున్న మా నిర్మాతల‌కు కృతజ్ఞతలు. దర్శకుడు అనుదీప్ స్టయిల్ లో ప్రిన్స్ అందరికీ వినోదం పంచబోతుంది. ఒక ఇండియన్, బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడటం ఈ సినిమా లైన్. దిన్ని అనుదీప్ హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. అక్టోబర్ 21న థియేటర్లో నవ్వుల వర్షం కురుస్తుంది. వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ చిత్రాలని ఆదరించిన  తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రిన్స్ కూడా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. తమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. మనోజ్ పరమహంస బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. మారియా తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. తన దేశంలో యుద్ధం జరుగుతుంది. ఈ సినిమాకి పని చేసిన డబ్బులతో తన దేశంలోని బాదితులకు సాయం చేయాలకునే గొప్ప మనసు తనది. అనుదీప్ ఈ సినిమాలో వినోదంతో పాటు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. విజయ్ దేవరకొండ స్వీట్, స్మార్ట్ పర్శన్. ఆయన గీతగోవిందం నాకు చాలా ఇష్టం. విజయ్ ప్రయాణం ఒక రాకెట్ లా వుంది. ఇంత తక్కువ సమయంలో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. కుదిరితే విజయ్ తో కలసి నటించాలని వుంది అన్నారు.
 
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్ వలన పెళ్లి చూపులు వచ్చింది. సునీల్ నారంగ్ గారు అర్జున్ రెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీరిద్దరూ నా కెరీర్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. వారు నిర్మించిన ప్రిన్స్ ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొననడం ఆనందంగా వుంది. ఎవడే సుబ్రమణ్యం చేస్తున్నపుడు నాగ్ అశ్విన్ , అనుదీప్ షార్ట్ ఫిలిమ్స్ చూపించి తెగ ఎంజాయ్ చేసేవాడు. వారిద్దరూ కలసి జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ తీశారు. ఇప్పుడు అనుదీప్ ప్రిన్స్ అనే ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశా. అనుదీప్ అందరినీ నవ్వించే దర్శకుడు. అక్టోబర్ 21న ప్రిన్స్ తో మరో విజయం అందుకుంటారని భావిస్తున్నా. మారియాకి ఈ సినిమా మంచి జ్ఞాపకంగా వుంటుందని అనుకుంటున్నా. శివ కార్తికేయన్ ని ఎప్పుడూ కల‌వలేదు కానీ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. శివకార్తికేయన్ గారి జర్నీ నాకు చాలా నచ్చింది. శివగారు ఒక కార్యక్రమంలో ఏడుస్తుంటే అది చూసి బ్రదర్ ఫీలింగ్ వచ్చేసింది. అక్టోబర్ 21న ప్రిన్స్ థియేటర్లోకి వస్తుంది. నేను గ్యారెంటీగా చూస్తున్నా. మీరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాను. 
 
రానా దగ్గుబాటి (వీడియో సందేశం) మాట్లాడుతూ.. శివకార్తికేయన్ గారికి తెలుగు చిత్ర పరిశ్రమకి స్వాగతం. ఈ సినిమా తర్వాత శివ గారు మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి. సునీల్ నారంగ్ గారికి కృతజ్ఞతలు. ప్రిన్స్ టీంకి ఆల్ ది వెరీ బెస్ట్'' తెలిపారు. 
 
హరీష్ శంకర్ మాట్లాడుతూ, జాతిరత్నాలు చూసిన తర్వాత మధ్యతరగతి జీవితం చదువుకున్నాడని అనిపించింది. ప్రపంచమంతా కరోనా యుద్ధం చేస్తున్నపుడు  జాతిరత్నాలు తో వినోదం పంచాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న దేశం నుండి ఒక అమ్మాయిని తెచ్చి హీరోయిన్ గా చేశాడు. యుద్ధంలో కూడా నవ్వులు పండించవచ్చు అది సినిమాతోనే సాధ్యమౌతుంది. శివ కార్తికేయన్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన టైమింగ్ , నటన అద్భుతంగా వుంటుంది. శివ కార్తికేయన్ కు తెలుగు పరిశ్రమలోకి స్వాగతం.  తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. బింబిలిక్కి, జెస్సికా పాటలు నాకు బాగా నచ్చాయి. ప్రిన్స్ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి'' అని కోరుకున్నారు. 
 
అనుదీప్ మాట్లాడుతూ, ప్రస్తుతం సమయంలో అందరూ చూడాల్సిన సినిమా ప్రిన్స్. తమన్, మనోజ్ పరమ హంస లాంటి పెద్ద టెక్నిషియన్స్ తో పని చేయడం ఆనందంగా వుంది. నా కోరైటర్ జగన్, లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రి గారికి కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ కి వచ్చిన విజయ్ దేవరకొండ, హరిష శంకర్ గారికి థాంక్స్. అక్టోబర్ 21 అందరూ ప్రిన్స్ ని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు. 
 
మారియా ర్యాబోషప్క మాట్లాడుతూ.. ప్రిన్స్ నాకు చాలా ముఖ్యమైన చిత్రం. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. అనుదీప్ ప్రత్యేక కృతజ్ఞతలు. అనుదీప్ అద్భుతమైన దర్శకుడు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. శివకార్తికేయన్ గారు అద్భుతమైన వ్యక్తి. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. భాష విషయంలో ఎంతో సపోర్ట్ చేశారు. ప్రిన్స్ అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి' అని కోరారు.  
 
తమన్ మాట్లాడుతూ.. అనుదీప్ జాతిరత్నాలు నాకు ఇష్టమైన సినిమా. ప్రిన్స్ కోసం అనుదీప్ తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. జాన్వి ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. మారియా ర్యాబోషప్క చాలా అంకిత భావంతో ఈ సినిమా చేసింది. శివకార్తికేయన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు.  ప్రిన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. శివ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారు. ప్రిన్స్ మీ అందరినీ తప్పకుండా అలరిస్తుంది'' అన్నారు. 
 
మనోజ్ పరమ హంస మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. శివకార్తికేయన్ నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన తెలుగు సినిమా చేయడం ఒక గొప్ప మార్పుకు నాందిలా భావిస్తున్నాను. అనుదీప్ ప్రయాణం మంచి అనుభవం.  సరిహద్దులు లేవలని చెప్పడం ప్రిన్స్ థీమ్. మారియా ర్యాబోషప్క ఈ కథకు చక్కగా సరిపోయింది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రిన్స్ మంచి కంటెంట్ వున్న సినిమా. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది'' అన్నారు.  
 
ప్రేమ్ జీ మాట్లాడుతూ.. అనుదీప్ దర్శకత్వంలో చేయడం చాలా ఆనందంగా వుంది. తమన్ నాకు మంచి స్నేహితుడు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రిన్స్ హిలేరియస్ ఫన్ ఎంటర్ టైనర్. అక్టోబర్ 21న అందరూ థియేటర్లో చూడాలి'' అని కోరారు.
 
సత్యరాజ్ మాట్లాడుతూ..  తెలుగులో నేను కట్టప్పగా లేదా మంచి తండ్రి పాత్రలు పోషించే నటుడిగా తెలుసు. ఇందులో అనుదీప్ నాతో చక్కని కామెడీ చేయించారు. ప్రిన్స్ విడుదల ఇక్కడ కామెడీ ఫాదర్ కూడా పాత్రలు వస్తాయనే నమ్మకం వుంది. మనోజ్ పరమ హంస ఈ సినిమాలో నన్ను చాలా యంగ్ గా చూపించారు. ఈ సినిమాతో నన్ను చాలా కొత్తగా చూస్తారు. ప్రిన్స్ ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది''అన్నారు
 
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. సురేష్ బాబు గారి కథల ఎంపిక అద్భుతంగా వుంటుంది. అనుదీప్ ట్రేడ్ మార్క్ తో ప్రిన్స్ కథ  చాలా వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో మూడు పాటలు రాశాను. మూడూ అద్భుతంగా కుదిరాయి. తమిళ వైపు శివకార్తికేయన్ తెలుగు వైపు అనుదీప్ అద్భుతమైన సమన్వయంతో ఈ సినిమా చాలా చక్కగా తీర్చిదిద్దారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రిన్స్ నూటికి నూరు శాతం వినోదం అందించే చిత్రంగా అలరిస్తుంది'' అన్నారు. 
 
జాన్వి మాట్లాడుతూ.. ప్రిన్స్ జర్నీ అద్భుతంగా సాగింది. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ వేడుకకు ముఖ్య అతిధులు వచ్చిన విజయ్ దేవరకొండ, , హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు. శివకార్తికేయన్ గారు అద్భుతమైన హీరో. గొప్ప వ్యక్తి. అనుదీప్ స్టయిల్ లో ప్రిన్స్ హిలేరియస్ ఎంటర్ టైనర్. అక్టోబర్ 21 ప్రేక్షకులకు ప్రిన్స్ లాఫ్ రైడ్ ఇవ్వనుంది. అందరూ థియేటర్ కి సినిమాని ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.