గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (11:01 IST)

గోదావరి ల్యాండ్‌స్కేప్ నేపథ్యంలో రక్షిత్, కోమలీ ప్రసాద్‌ల‌ శశివదనే చిత్రం

Rakshit Atluri, Komali Prasad
Rakshit Atluri, Komali Prasad
రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ న‌టిస్తోన్న చిత్రం శశివదనే. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ నిర్మాణ సారద్యంలో రూపొందుతోంది. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ కోనసీమలోని అందమైన లొకేషన్లలో 50 రోజుల పాటు  జరిపిన చిత్రీకరణ జరుపుకుంది. మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ సందర్బంగా  చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ  మాట్లాడుతూ..శశివదనే' చిత్రాన్ని కోనసీమ, అమలాపురంలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించాం. అద్భుతమైన అనుభవం మరియు జ్ఞాపకాలను అందించిన కోనసీమకు ధన్యవాదాలు.ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియో క్లిప్‌లో, పెద్ద ఎత్తున పొలాలు మరియు చెట్లను సౌందర్యంగా బంధించడాన్ని మనం చూస్తాము. 'శశివదనే' విజువల్స్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి అద్భుతమైన వీడియో నిదర్శనం. సినిమాలో ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్‌గా ఉండబోతున్నాయి. గోదావరి ల్యాండ్‌స్కేప్ నేపథ్యంలో గ్రాండియర్ మరియు హై స్టాండర్డ్స్‌తో సన్నివేశాలు వస్తాయి.

‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్నాడు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'శశివదనే' చిత్రంలో  హీరో చాలా చక్కని నటనను కనపరచాడు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది.చిత్ర దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన సెలెక్ట్ చేసుకున్న గోదావరి నేపథ్యంలోని  లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని చాలా అందంగా తెరకెక్కించాడు. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.