శశివదనే నుంచి కోమలీ ప్రసాద్ ఫస్ట్ లుక్
రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శశివదనే సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం లో అహితేజ బెల్లంకొండ నిర్మాణ సారద్యంలో గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం శశివదనే. ఈ రోజు చిత్ర హీరోయిన్ కోమలి ప్రసాద్ బర్త్ డే ను పురస్కరించు కొని చిత్ర యూనిట్ విడుదల చేసిన "శశివదనే" ఫస్ట్ లుక్ తో అందరినీ కట్టి పడేస్తుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. పలాస 1978 సినిమాతోప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రక్షిత్ అట్లూరి చాలా చక్కని నటనను కనపరచ్చాడు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది. ఈ చిత్రంలో పని చేసిన నటీ నటులు అందరూ పోటీ పడి నటించారు. చిత్ర దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామా గా తయారు చేసుకున్న శశివదనే చిత్రాన్ని చాలా చక్కగా గ్రాండియర్‌గా, హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ పై సాగే లవ్ సీన్స్ చాలా కొత్తగా యూనిక్‌గా ఉంటాయి.ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. సెప్టెంబర్ 1 నుండి షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించి మిగిలి వున్న 10 రోజుల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నారు.
నటీ నటులు- రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్, RX 100 రాంకీ,సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, తదితరులు.
సాంకేతిక నిపుణులు- పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: గ్యారీ బీహెచ్, కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్ (డెక్కన్ డ్రీమ్స్), సీఈవో: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ – సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన