శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (17:24 IST)

తనీష్, వికాస్ వశిష్ట హీరోలుగా అంతేలే కథ అంతేలే

Taneesh, Vikas Vashishta, Sahar Krishnan
Taneesh, Vikas Vashishta, Sahar Krishnan
అనంతపురం బ్యాక్ డ్రాప్ లో  ఎమోషన్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం "అంతేలే కథ అంతేలే".రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్ ,వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్) , శ్రీనివాస్ నటీ నటులుగా మహారాజశ్రీ,లంక వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందినటువంటి దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో  తెరకెక్కనున్న కొత్త చిత్రం "అంతేలే కథ అంతేలే" సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానున్నది.
 
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు శ్రీ యం నివాస్ మాట్లాడుతూ, ఈ సినిమా  రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల  గ్రామంలో జరిగే కథ, అనేక భావోద్వేగాలు ఈ కథలో మిళితమై ఉంటాయి.ఈ చిత్రాన్ని అనంతరం, నల్గొండ, హైదరాబాద్ లల్లో మూడు షెడ్యూల్ లో షూటింగ్  చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
 
హీరో తనీష్  మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా  ప్రేక్షకులు  అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి  చేస్తున్న  అద్భుతమైన ఎమోషన్స్ తో కూడిన  పాత్ర ఇది.ఇందులో  హ్యూమన్ రిలేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు గుండెలు బరువెక్కుతాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ను మంచి విజయం  సాదించాలి అన్నారు
 
హీరో వికాస్ వశిష్ట  మాట్లాడుతూ .. సినిమా బండి తరువాత  చేస్తున్న ఈ సినిమా టైటిల్ లోనే కథ ఉంది. ఇందులో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి టీం దొరికింది. నివాస్ గారు ఈ కథ చెప్పినపుడు. చాలా నచ్చింది. ఇందులో ఎక్కువ మాటలు  ఉండవు కానీ ఎమోషన్ కథను క్యారీ చేస్తుంది.ఈ సినిమాను కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను.
 
హీరోయిన్ సహార్ కృష్ణన్  మాట్లాడుతూ..నా యాక్టింగ్ చూడకుండానే నన్ను ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు  సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నా కిచ్చిన పాత్రను 100% ప్రేక్షకులను మెప్పించేలా పోసిస్తాను అన్నారు .
నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ .. సీనియర్ నటి గీతాంజలి  రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు  మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది అన్నారు.