శనివారం, 5 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (17:17 IST)

డై హార్డ్ ఫ్యాన్ సస్పెన్స్ కామెడీ చిత్రం - సుకుమార్

Die Hard Fans team
Die Hard Fans team
సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటిది ఓ అభిమాని త‌ను అభిమానించే హీరోయిన్‌ని క‌ల‌వాల‌నుకుంటాడు.అనుకోకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ M  దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మిస్తున్న చిత్రం "డై హార్డ్ ఫ్యాన్".  ఈ చిత్రంలో  హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. తాజాగా ఇందులో పరుగే పరుగు పాటను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేశారు. ఈ పాటచాలా అద్బుతంగా ఉందని ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా దర్శకులు సుకుమార్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
 
 అనంతరం దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. అభిరామ్ M  దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మించిన  సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా ఫ్రెండ్ మధు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి కొన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని  మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. చాలా మంది ఈ టైటిల్ క్రెజీగా ఉందని పెట్టారా అని అడుగుతున్నారు. అయితే టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుంది. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి.మధు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.బేబమ్మ పాత్రలో షకలక శంకర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది.కృష్ణ కాంత్ గా రాజీవ్ కనకాల, నోయల్, హీరో, హీరోయిన్ లు  చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా క‌థ లో మ‌లుపులు ప్రేక్ష‌కుడ్ని థ్రిల్ చేస్తాయి. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు
 
చిత్ర నిర్మాత చంద్రప్రియ సుబుధి మాట్లాడుతూ.. కథే హీరో. కంటెంట్ ఉంటేనే ఏ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు అదరిస్తారని నమ్ముతాను. అందుకే నేను కంటెంట్ ను నమ్మి ఈ సినిమా నిర్మించాను. ద‌ర్శ‌కుడు అభిరామ్ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని చిత్రీక‌రించాడు. ఈ సినిమాకు టీం అంతా ఎంతో కష్టపడ్డారు.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ  ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.
 
నటుడు షకలక శంకర్  మాట్లాడుతూ.."డై హార్డ్ ఫ్యాన్" కు బలం ఓన్లీ కథ. ఇలాంటి మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని  తీశారు దర్శక, నిర్మాతలు. సాహో లో ప్రభాస్ నోటి వెంట  వచ్చిన డైలాగ్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టడం జరిగింది.ఈ కథకు  ఈ టైటిల్ 100%యాప్ట్. టైటిల్ తగ్గట్టే  సినిమా ఉంటుంది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు..
 
నటుడు  నోయల్ మాట్లాడుతూ.. సుకుమార్ గారు నన్ను గుర్తించడం వలెనే ఈ రోజు ఆర్టిస్ట్ గా మీ ముందు ఉన్నాను.దర్శకుడు అభిరామ్ తో నేను చేసిన రెండవ సినిమాఇది.చాలా మంది నటులు వున్నా ప్రొడ్యూస్ చేసే వారు తక్కువ అలాంటిది అభిరామ్, శివ, ప్రియాంక లను నమ్మి తీసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది.నిర్మాతలకు పెద్ద హిట్ అవ్వాలి.వారికి నా ధన్యవాదములు.
 
చిత్ర హీరో శివ ఆలపాటి మాట్లాడుతూ..నా మొదటి సినిమాకే సీనియర్ ఆర్టిస్టులతో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు 
చిత్ర హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ..సవారీ చిత్రం తరువాత మంచి స్కోప్ ఉన్న  పాత్రలో నటిస్తున్నాను.టీం అంతా ఎంతో  హార్డ్ వర్క్ చేశాము. మంచి కంటెంట్ తో  సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి మాట్లాడుతూ.. టీం అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు