మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (16:41 IST)

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన మేలో విడుదల

Srivishnu and ohters
Srivishnu and ohters
శ్రీవిష్ణు  కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో  రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు కు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది.
 
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మే 18న వేసవి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా సామజవరగమన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ప్లజంట్ గా వుంది ఉంది. శ్రీవిష్ణు కుటుంబంలోని అందరు ఆడవాళ్లతో కలిసి కనిపించారు.
 
సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి  అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. సామజవరగమన ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది.  భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి  పని చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
 
తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.