శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (12:25 IST)

కోస్టల్‌ లాండ్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఎన్‌.టి.ఆర్‌.30 సినిమా: కొరటాల శివ

ntr,rajamouli, prakashraj
ntr,rajamouli, prakashraj
ఎన్‌.టి.ఆర్‌.30 సినిమా ప్రారంభోత్సవం గురువారంనాడు జరిగింది. హైటెక్ సిటీలోని స్టార్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి రాజమౌళి, ప్రకాశం రాజ్, మంచి విష్ణు ప్రముఖ సినీవర్గాలు హాజరయ్యాయి. యువసుధ ఆర్ట్స్‌ బేనర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. కళ్యాణ్ రామ్ నిర్మాత.  ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, చిత్ర కాప్షన్‌లో చెప్పినట్లుగా భయం వుండాలి. భయపెట్టాలి. అదే ఈ సినిమా. ఈ కథ కోస్టల్‌ లాండ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇండియాకు సంబంధించిన కథ.

ntr, kalayanram
ntr, kalayanram
అందుకే పాన్‌ ఇండియాగా తీస్తున్నాను. ఇందుకు నాకు పెద్ద ఆర్మీ దొరికింది. నా కథకు సంగీతపరంగా అనిరుద్‌ ప్రాణం పోస్తున్నాడు. నాతోటి ఎంతోకాలంగా జర్నీ చేస్తున్న యుగంధర్‌ వి.ఎఫ్‌.ఎక్స్‌. అద్భుతంగా చూపించనున్నాడు. ఆండీతో పనిచేయడం ఆనందంగా వుంది. అలాగే నా ఊహకు జీవం పోస్తున్న సాయిసురేన్‌కు ధన్యవాదాలు. జాన్వీ కపూర్‌ లీడ్‌ రోల్‌ చేస్తుంది. ఫ్యాన్స్‌కు మంచి సినిమా ఇస్తున్నానని చెప్పగలను అని చెప్పారు. 
 
koratala, anirudh and team
koratala, anirudh and team
అనిరుద్‌ మాట్లాడుతూ, తారక్‌ సినిమాలో చేయడం ఆనందంగా వుంది.  నేను తిరిగి వస్తున్నాను అని అన్నారు. ఆండ్రూ మాట్లాడుతూ, సముద్రం బ్యాక్‌ డ్రాప్‌లో వుంటున్న కథ. అందుకే కొన్ని బ్లూ స్క్రీన్‌ సెట్‌పైనే తీయాల్సి వుంటుంది అన్నారు.
 
యుగంధర్‌ తెలుపుతూ, 25 ఏళ్ళుగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేస్తున్నాను. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. వి.ఎఫ్‌.ఎక్స్‌లో బెస్ట్‌ సినిమా అయ్యేలా చేయనున్నానని తెలిపారు.