ఎన్.టి.ఆర్.30 సినిమా షూటింగ్ వాయిదా
ఫిబ్రవరి 24న అన్నపూర్ణ స్టూడియోలో జరగాల్సిన ఎన్.టి.ఆర్.30 చిత్రం షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ సోమవారంనాడు ప్రకటించింది. నందమూరి తారకరత్న చనిపోయిన సందర్భంగా కళ్యాణ్ రామ్ కుటుంబంలో విషాధ ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎప్పటినుంచో ఈ సినిమాపై ప్రీ ప్రొడక్షన్ పనులు దర్శకుడు కొరటాల శివ చేస్తున్నారు.
తాజాగా షూటింగ్ తేదీని కూడాప్రకటించారు. అయితే నందమూరి కుటుంబంలో దురదృష్టకర సంఘటనలు జరగడంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.. తారకరత్న భౌతిక కాయాన్ని ఎన్.టి.ఆర్. ఫిలింఛాంబర్‌లో సందర్శించి కన్నీళ్ళు పెట్టుకున్నారు. అక్కడే వున్న బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబీకులు ఆయన్ను ఓదార్చారు.