47 ఏళ్ళ క్రితం అక్కినేని నాగేశ్వరరావుగారి కలకు పునాది
Akkineni Nageswara Rao, Sr. NTR, Fakhruddin Ali Ahmed
తెలుగు సినిమారంగంలో అక్కినేని నాగేశ్వరరావు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ కు పునాది వేశారు. కొండలు, గుట్టలు, చెట్లు అడ్డదిడ్డంగా వున్న రాల్ళు వీటినన్నింటినీ ఆయన చదునుచేసి స్టూడియో నిర్మాణం చేపట్టారు. 47 ఏళ్ళ నాడు ఇదేరోజు అప్పటి ఇండియన్ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ స్టూడియోను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ ఎన్.టి.ఆర్., అన్నపూర్ణమ్మ, జూనియర్ నాగార్జున తదితరులు హాజరయ్యారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా నాగేశ్వరరావుగారి కల నెరవేరిన రోజు ఇది. అప్పటినుంచి దినదినాభివృద్ధి చెందుతూ వటవృక్షంగా నిలిచింది. ఎంతో మంది నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి గుర్తింపు తెచ్చి అన్నపూర్ణ స్టూడియోను అందరికీ పరిచయం చేయాలని ఆనాటి ఫొటోలతో కనువిందు చేశారు.