మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (07:42 IST)

గర్వపడే సినిమాగా ఎన్టీఆర్ 30 ఉంటుంది

Rajani, ntr
Rajani, ntr
ఎన్టీఆర్. తన తదుపరి మూవీని గతంలో తనతో జనతా గ్యారేజ్ వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన కొరటాల శివ తో చేయడానికి సిద్ధం అయ్యారు ఎన్టీఆర్. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఎన్టీఆర్ 30 మూవీకి సంబంధించి ప్రస్తుతం లొకేషన్ సెర్చింగ్ లో భాగంగా గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ భారీ యాక్షన్ పార్టీ తీయనున్నట్లు తెలుస్తోంది. ముందుగా పాటలు అనుకున్నారు. కానీ దర్శకుడు కొరటాల యాక్షన్ బాగా డెసైన్ చేసినట్లు సమాచారం. 
 
ఇటీవలే ఎన్టీఆర్. బెంగుళూర్ ఉత్య్సవాలకు వెళ్లారు. అక్కడ రజనీకాంత్ కూడా ఉన్నారు. అప్పుడు ఎన్టీఆర్. మాట్లాడుడూ, ఇంత చిన్న వయసులో ఇంత గౌరవం ఇంత ఘనత సాధించడం చూసి మీ అభిమానులుగా చాలా గర్వపడుతున్నాను అంటూ తదుపరి మూవీ అందరూ గర్వపడే సినిమాగా ఉంటున్నదని తెలిపారు.  ఇప్పటికే మూవీకి వర్క్ చేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ సాబు సైరిల్, కెమెరా మ్యాన్ రత్నవేలు ఇద్దరూ కూడా ప్రస్తుతం గోవాలో పలు అద్భుత లొకేషన్స్ వేటలో ఉన్నారట. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించి ఇతర వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతుండడంతో అతి త్వరలోనే ఎన్టీఆర్ 30 మూవీ పట్టాలెక్కనుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.