సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (18:15 IST)

ఎన్.టి.ఆర్. సినిమాలో బాలీవుడ్ భామ ఫిక్స్ (video)

jahnvi-ntr
jahnvi-ntr
ఎన్.టి.ఆర్. కథానాయకుడుగా నటించనున్న పాన్ ఇండియా సినిమా త్యరలో ప్రారంభం కానుంది. కొరటాల శివ దర్శకుడుగా చేస్టున్నారు. కాగా, ఇందులో నాయికగా ఎవరు అనే సందేహాలు ఉన్నాయి. ఎట్టకేలకు శ్రీదేవి కూతురు  జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. గతంలో బాలీవుడ్ లో ఆమె మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. సినిమాలో చేయాలనుంది అని తెలిపింది. 
 
కాగా, ఈరోజు జాన్వీ కపూర్ హైదరాబాద్ వస్తోంది. మిలి అనే సినిమా ప్రమోషన్ కోసం ఆమె వస్తుంది. బోనీ కపూర్ కూడా వస్తున్నారు. పనిలో పనిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ వారిని కలవనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ చేస్టున్నారు. త్వరలోనే అధికారిక అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది.