సోమవారం, 4 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:00 IST)

బాలయ్య 'అన్ స్టాపబుల్' షో.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తారా?

Balakrishna
Balakrishna
ఓటీటీ సంస్థ 'ఆహా' వేదికగా బాలయ్య 'అన్ స్టాపబుల్' అనే షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. దీని మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత నెలలో రెండో సీజన్ ప్రారంభమైంది. ముందుగా రాజకీయ రంగం నుంచి మాజీ సీఎం చంద్రబాబునాయుడు తదితరులను గెస్టులుగా పిలిచారు. 
 
ఆ తరువాత సినీ రంగం నుంచి కొందరిని పిలిచారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ను పిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా బాలయ్య షోకు జూనియర్‌ను ఎలాగైనా తీసుకొచ్చే పనిలో పడిందట షో బృందం. కేవలం జూనియర్ ఎన్టీఆర్‌నే కాదు అయన అన్న కళ్యాణ్ రామ్‌ను కూడా తీసుకొస్తారని అంటున్నారు. 
NTR_Kalyan Ram
NTR_Kalyan Ram
 
కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఆయన నటించిన 'బింబిసార' సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఆ సినిమా సందర్భంగా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి జూనియర్‌తో కలిసి కల్యాణ్ రామ్ హాజరయ్యారు. తాజాగా ఇదే ఊపుతో బాలయ్య షోలో కనిపిస్తే నందమూరి ఫ్యాన్సుకు మస్తు మజాగా వుంటుందని సినీ పండితులు అంటున్నారు.