మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (19:05 IST)

బింబిసార సూపర్ రికార్డ్.. జీ-5లో సంచలనం.. 100 మిలియన్?

Bimbisara song
బింబిసార సినిమా గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్ తెస్రా, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా అదిరే రికార్డును సొంతం చేసుకుంది. మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని జీ-5 సొంతం చేసుకుంది.  
 
తాజాగా బింబిసార బ్లాక్ బస్టర్ సినిమా జీ-5లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం.