మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (18:55 IST)

ఎన్‌.టి.ఆర్‌. 30 సినిమాకు ముహూర్తం ఖరారు

NTR 30 new poster
NTR 30 new poster
ఎన్‌.టి.ఆర్‌. 30 సినిమాకు ఈసారి ఫైనల్‌ ముహూర్తం ఖరారైంది. ఆర్‌ఆర్‌.ఆర్‌. ఆస్కార్‌ అవార్డు ఫంక్షన్‌ ఏర్పాట్లు ముగించుకుని వచ్చిన ఎన్‌.టి.ఆర్‌. వెంటనే దాస్‌ కా దమ్కీ ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ఇక ఇప్పుడు తన స్వంత సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. గతంలో అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించాలని ప్లాన్‌ చేశారు. అనివార్య కారణావల్ల సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.
 
ఇక ఇప్పుడు ఈ సినిమాను మార్చి 23న ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. జాన్వీ కపూర్‌ నాయికగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మాత. సంగీతాన్ని అనిరుద్‌ చేస్తున్నారు. ఎన్‌.టి.ఆర్‌. కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా మాస్‌ యాక్షన్‌ సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా తీర్చేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్‌ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.