ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (16:59 IST)

అన్ స్టాపబుల్ నుంచి బుల్ బుల్ అన్ స్టాపబుల్ సాంగ్ లాంచ్ చేసిన గోపీచంద్

Gopichand launched Bull Bull Unstoppable song
Gopichand launched Bull Bull Unstoppable song
పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'.  'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక.  బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలియన్  'అన్ స్టాపబుల్' టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా 'అన్ స్టాపబుల్' మ్యూజికల్ ప్రమోషన్స్ ని సమొదలుపెట్టారు మేకర్స్. ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ బుల్ బుల్ అన్ స్టాపబుల్ ని మాచో స్టార్ గోపీచంద్ లాంచ్ చేశారు. ఈ పాటని ఫుట్ ట్యాపింగ్ డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు భీమ్స్.
 
ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలసి భీమ్స్ ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం క్యాచిగా వుంది. విజె సన్నీ, సప్తగిరి చేసిన మాస్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.  
 
ఈ చిత్రానికి కో ప్రోడ్యుసర్లుగా షేక్ రఫీ, బిట్టు, రాము వురుగొండ వ్యవహరిస్తున్నారు. డీపీపీ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా ఉద్ధవ్ పని చేస్తున్నారు.