మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (16:16 IST)

డైరెక్టర్ నక్కిన త్రినాధ్ మెచ్చిన మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్

Mr. Kalyan trailer launching by director Nakkina Trinadh
Mr. Kalyan trailer launching by director Nakkina Trinadh
మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా మిస్టర్ కళ్యాణ్ చిత్రం రూపొందుతోంది. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత NV. సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై  నిర్మించబడింది. 
 
సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది. ఒక ప్రేత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చెయ్యడం జరిగింది. 
 
కాగా, మిస్టర్ కళ్యాణ్'' ట్రైలర్ ను  దర్శకులు నక్కిన త్రినాధ్ విడుదల చేశారు.  అనంతరం ఆయన  మాతుడుతూ... మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ బాగుంది, మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. అందరూ ఆర్టిస్ట్స్ లు బాగా చేశారు. దర్శకుడు పండు కు అలాగే నిర్మాత సుబ్బారెడ్డి గారికి ఈ సినిమా మంచి విజయం సాధించి వారు మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను. అందరూ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.