శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (10:44 IST)

ఎన్‌.టి.ఆర్‌.30 సినిమా మార్చిలో ప్రారంభం

ntr30 poster
ntr30 poster
నందమూరి తారకరామారావు (జూ. ఎన్‌.టి.ఆర్‌.) కొత్త సినిమా ఎన్‌.టి.ఆర్‌. 30 సినిమా షూటింగ్‌ ఈనెల 24న జరగాల్సింది వాయిదా పడిరది. నందమూరి తారకరత్న మరణం ఆ తర్వాత జరిగే కార్యక్రమాల రీత్యా వాయిదా వేస్తున్నట్లు యువసుధ ఆర్ట్స్‌ సంస్థ తెలిపింది. అయితే మంగళవారంనాడు ఆ సంస్థ ఎన్‌.టి.ఆర్‌. 30 సినిమాను మార్చి 20న షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
 
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటీనటులు నటించనున్నారు. అదేవిధంగా దక్షిణాదిలో ఫేమస్‌ నటీనటులు కూడా నటించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. వచ్చే ఏడాదికి ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.