శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (10:38 IST)

ఆస్కార్‌ కోసం అమెరికా వెళ్ళిన రామ్‌చరణ్‌

Ramcharan airport
Ramcharan airport
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలోని నాటునాటు సాంగ్‌కు ఆస్కార్‌ నామినేషన్‌ విషయం తెలిసిందే. ఇటీవలే రాజమౌళి, కీరవాణితోపాటు ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చరణ్‌ కూడా యు.ఎస్‌.ఎ. వెళ్ళి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత పాట రాసిన చంద్రబోస్‌ను తీసుకుని కీరవాణి కూడా మరోసారి వెళ్ళారు. ఇక మార్చి 21న ఆస్కార్‌ అవార్డుల ఈవెంట్‌ జరగనుంది.
 
ఈ సందర్భంగా కర్టెన్‌ రైజర్‌లో భాగంగా రామ్‌చరణ్‌ నిన్న రాత్రి హైదరాబాద్‌ నుంచి యు.ఎస్‌.ఎ. బయలుదేరి వెళ్ళారు. షంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో లోపలికి రాగానే ఆయన్ను సంబంధీకులు స్వాగతం పలికారు. విమానం ఎక్కడ వుంది.. ఎక్కడ దిగాలి వివరాలను ఆయనకు చెబుతున్నారు. ఇక త్వరలో రాజమౌళి, ఎన్‌.టి.ఆర్‌.కూడా వెళ్ళనున్నారు. ఇప్పటికే ఎన్‌.టి.ఆర్‌. తారకరత్న మరణం తర్వాత సినిమాను కూడా వాయిదా వేసుకున్నారు.