బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (11:15 IST)

రామ్‌ చరణ్‌ హాలీవుడ్‌కు వెళతాడా?

James Cameron
James Cameron
రామ్‌ చరణ్‌ కొణిదెల హీరోగా ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆస్కార్‌ నామినేషన్‌లో నాటునాటు సాంగ్‌ వెళ్ళగానే అది మరింత వ్యాప్తి చెందింది. కమల్‌హాసన్‌తో పాటు పలువురు తమ సినిమాలు ఆస్కార్‌వరకు వెళ్ళలేకపోయాయని బాధపడ్డారు కూడా. అలాంటిది రాజమౌళి తన జిమ్మిక్కులతో ఆస్కార్‌ వాళ్ళను ఆకట్టుకున్నాడు. కాగా, ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు ఇంకా హాలీవుడ్‌ నుంచి అభినందనలు వస్తూనే వున్నాయి. దర్శకుడు జేమ్స్‌ కేమరూన్‌ ప్రత్యేకంగా రామ్‌చరణ్‌ చేసిన రామరాజు పాత్ర గురించి రాజమౌళితో చర్చించడంతోపాటు తన సినిమా టైటానిక్‌ రీ రిలీజ్‌ టైంలో కూడా హాలీవుడ్‌ మీడియాతో రామ్‌చరణ్‌ పాత్ర గురించి ప్రస్తావించడం, అందుకు రాజమౌళి తీసుకున్న కేర్‌ను అభినందిస్తూ చిన్న వీడియో ట్వీట్‌ చేశాడు. 
 
ఇది చూశాక తండ్రిగా మెగాస్టార్‌ చిరంజీవి ఉబ్బితబ్బియ్యారు. తనకు చాలా గర్వంగా వుందని ట్వీట్‌ చేశాడు. కేమరూన్‌ లాంటి గ్లోబర్‌ ఐకాన్‌ చేత నీ పాత్ర గురించి ప్రశంసలు అందుకోవడం ఓ ఆస్కార్‌ లాంటిది అని చరణ్‌కు గ్రేట్‌ హానర్‌ అయితే నాకు తండ్రిగా ఎంతో గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది రామ్‌చరణ్‌ భవిష్యత్‌కు ఎంతో దోహదపడుతుందని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. ఇది చూసిన తర్వాత చిరంజీవి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఫ్యూచర్‌లో రామ్‌చరణ్‌ హాలీవుడ్‌ ప్రవేశానికి కేమరూన్‌ ప్రశంస ఓ ఐడిగా వుందంటూ ఒకరు ట్వీట్‌ చేశారు. సో.. రాజమౌళి ఎంత పనిచేశాడో గదా అంటూ మరికొందరు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.