సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (09:03 IST)

సమంత వర్కౌట్ వీడియో వైరల్.. 2023 మనం బలపడే సంవత్సరం

Samantha
టాలీవుడ్ నటి సమంత రూతు ప్రభు తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఫిట్ నెస్‌పై ఆమె ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తే, ఫిట్‌నెస్ సెషన్‌కు సంబంధించిన చాలా వీడియోలుంటాయి. 
 
తాజాగా ఓ ఎక్సర్‌సైజ్ వీడియోను ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వర్కౌట్ చేస్తున్నట్లు కనిపించే ఈ వీడియోకు భారీగా లైకులు వస్తున్నాయి.
 
గత రాత్రి, యశోదా లేడీ ముంబైలోని జిమ్ నుండి నేలపై కార్డియో చేస్తున్న వీడియోను షేర్ చేసింది.  ఆమె దానికి క్యాప్షన్ ఇచ్చింది. 2023 మనం బలపడే సంవత్సరం... అంటూ రాసుకొచ్చింది. ఆమె వీడియో క్లిప్‌కి ఆమె అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. కెరీర్ పరంగా సమంత ప్రస్తుతం ఖుషీ, శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది.