ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:01 IST)

సమంత వాలెంటైన్స్ డే పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్

mallika song samantha
టాలీవుడ్ నటి సమంత వాలెంటైన్స్ డే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. ప్రేమికుల రోజున, యశోద నటి సమంత జిమ్‌లో పంచ్ ప్యాక్ చేస్తూ రోజంతా గడిపింది. 
 
నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకుంది. దీనిలో ఆమె బాక్సింగ్ గ్లవ్స్ ధరించి వుండటం చూడవచ్చు. అయితే ఆమె ట్రైనర్ తన ప్రాక్టీస్‌లో సహాయం చేస్తున్నారు. సమంత పోస్ట్‌కి "హ్యాపీ వాలెంటైన్స్" అని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి చాలా స్పందనలు వచ్చాయి. 
 
ఇటీవల, తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించడానికి సమంత 600 మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. త్వరలో సమంత తన శాకుంతలం చిత్రంతో అలరించనుంది.