గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (22:46 IST)

పెంపకం సరిలేదు.. నా చెప్పులతో చెంపలేస్తా.. అనసూయ ఫైర్

Anasuya's beauty
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భర్తతో జీవితం క్రేజీగా రోలర్ కోస్టర్ రైడ్‌లా వుంటుందని.. ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. 
 
ఈ క్యాప్షన్‌కు ఒక నెటిజన్ విమర్శనాత్మక పోస్టు చేశాడు. అంతలేదంటూ.. అనసూయ భర్త దగ్గర డబ్బు వుంది అంతే అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఎంతుందేంటి డబ్బు... నా దగ్గర లేదా? అని ప్రశ్నించింది. అంతేగాకుండా అదేంటి తమ్ముడు బావగారిని అలా మర్యాద లేకుండా మాట్లాడవచ్చా అంటూ అడిగింది. 
 
పెంపకం సరిలేదని.. చెంపలేసుకోమని మండిపడింది. లేకపోతే.. తన చెప్పులతో చెంపలేస్తానని ఘాటు కౌంటరిచ్చింది.