మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (10:35 IST)

నగల దుకాణంలో బంగారు హారాన్ని దొంగలించిన ఎలుక

నగల దుకాణంలో ప్రదర్శనకు ఉంచిన బంగారు హారాన్ని ఎలుక దొంగిలించిన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం రేపింది. ఐపీఎస్ అధికారి రాజేష్ హింగాంకర్ ఓ సూపర్ ఫుటేజీని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కేవలం 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో, ఒక ఎలుక బంగారు హారాన్ని దోపిడి చేస్తోంది. ఎలుక ఒక గ్యాప్ నుండి ధైర్యంగా లోపలికి దూకుతుంది. 
 
నెక్లెస్ స్టాండ్‌పై నేరుగా ల్యాండ్ అవుతుంది, ఆపై గొళ్ళెంతో ఫిడిల్ చేస్తూ హారాన్ని పట్టుకెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.