మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (15:19 IST)

ఆయన సీఎం జగన్ కాదు.. అప్పురత్న జగన్ : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పైగా, సీఎం జగన్‌కు కొత్త పేరును పెట్టారు. ప్రతివారం క్రమం తప్పకుండా అప్పులు తెస్తున్న సీఎం జగన్‌ రెడ్డిని ఇక అప్పుల రత్న జగన్‌గా సంభోదించాలని ఆయన పిలుపునిచ్చారు.
 
ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ప్రతివారం క్రమం తప్పకుండా ఆర్బీఐలో బాండ్లను తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్న జగన్‌పై మండిపడుతూనే.. సీఎంను అప్పురత్న అంటూ పిలిచారు. అప్పులతో దేశ వ్యాప్తంగా ఏపీ పేరు మోరుమోగిస్తున్నందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాభినందనలు అంటూ ఎద్దేవా చేసారు. 
 
ఓ వైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతూ, మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దని సూచించారు. రాష్ట్ర సంపద, ప్రజల భవిష్యత్‌ను గాలికొదిలేసి మీ సంపదను పెంచుకోండని ఆయన విమర్శించారు. గత కొన్ని రోజులుగా సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పవన్ కళ్యామ్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.