సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (09:42 IST)

విశాఖలో ఊపందుకున్న ఏపీ రాజధాని నిర్మాణ పనులు

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పనులు విశాఖపట్టణంలో ఊపందుకున్నాయి. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగుతుందని, తాను కూడా విశాఖపట్టణానికి మకాం మార్చనున్నట్టు ఇటీవల ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రులు కూడా విశాఖపట్టణం నుంచే పాలన ప్రారంభంకానుందంటూ ప్రకటించారు. పైగా, సీఎం జగన్ ప్రకటనలో అధికారులు కూడా రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశారు. 
 
అయితే, ఈ విషయంపై అధికార యత్రాంగం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ మౌఖికంగా ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీచ్‌ రోడ్డులో ఉండేందుకు అనువైన ఇంటి స్థలం కోసం అధికారులు గాలిస్తున్నట్టు సమాచారం. 
 
వీవీఎంఆర్డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్కన నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడాన్ని బట్టి చూస్తే సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు సమాచారం.క