సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బాదుడే.. బాదుడు.. : పెట్రోల్ ధరల బాదుడులో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం...

petrol
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజల్‌ ఇంధనాలపై బాదుడే బాదుడు. ఫలితంగా దేశంలోనే అధిక మొత్తంలో పెట్రోల్ ధరలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తమ ప్రభుత్వంలో బాదుడు ఏ విధంగా ఉంటుందో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చూపిస్తున్నారు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ సరకులు అమ్ముకునే చిరు వ్యాపారుల నుంచి సరకు రవాణా వాహనాల యజమానుల వరకు అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తున్నారు. 
 
ప్రభుత్వ బాదుడు భరించలేక వాహనదారులు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. లారీ, ట్రాక్టర్ యజమానులు అయితే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేటపుడె పెట్రోల్, డీజిల్ ట్యాంకులను భర్తీ చేయించుంకుని వస్తున్నారు. అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల వారైతే తమకు సమీపంలోని కర్నాటక రాష్ట్రానికి వెళ్లి పెట్రోల్ నింపుకుంటున్నారు. 
 
ఫలితంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాల వృద్ధి గణనీయంగా నమోదైంది. కర్నాటలో డీజిల్‌పై 71.24 శాతం, పుదుచ్చేరిలో 134.47 శాతం నమోదైంది. పెట్రోలు అమ్మకాల్లో పుదుచ్చేరిలో 53.54 శాతం, కర్నాటకలో 26.33 శాతం వృద్ధి కనిపించింది. ఇది తమిళనాడులో 20.95శాతంగా ఉంది.