బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (11:41 IST)

నేడు జగనన్న విదేశీ విద్యాదీవెనకు తొలిసారి బటన్ నొక్కుడు

ys jaganmohan reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద తొలిసారి అర్హులైన లబ్దిదారులకు ఆయన శుక్రవారం బటన్ నొక్కి డబ్బులు జమ చేసింది. తొలి విడత సాయం కింద రూ.19.95 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
 
ఈ యేడాది టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరికి ఈ నిధుల పంపిణీ కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో సీఎం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేడు జమ చేశారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లను ట్యూషన్ ఫీజను చెల్లిస్తారు. విద్యార్థులకు విమానం, వీసా చార్జీలను సైతం రీయింబర్స్‌మెంట్ చేసింది.