బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వచ్చే ఎన్నికల్లో వైకాపా టిక్కెట్‌పై పోటీ చేయను : ఎమ్మెల్యే సుధాకర్

sudhakar
వచ్చే ఎన్నికల్లో వైకాపా టిక్కెట్‌పై పోటీ చేయనని కర్నూరు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ స్పష్టం చేశారు. ఈ మాటలకు సొంత పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. 
 
కర్నూలు గ్రామీణ మండలం ఉల్చాలలో శనివారం 'గడపగడపకు' కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. వైకాపా మాజీ మండల అధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్‌నాయుడు ఆయన్ను తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. 
 
'మీరో నమ్మకద్రోహి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వాళ్లను పక్కనపెట్టారు. మీకు టిక్కెట్‌ రావడానికి కష్టపడిన వారిని మరిచిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన రౌడీమూకలను అందలం ఎక్కించారు. ఇంతటి నమ్మక ద్రోహం చూడలేదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పద'ని ఎమ్మెల్యే సమక్షంలోనే హెచ్చరించారు. 
 
దీనిపై ఎమ్మెల్యే సుధాకర్ స్పందిస్తూ, రానున్న ఎన్నికల్లో పోటీ చెప్పారు. గ్రామస్థుడు బోయ శివ మాట్లాడుతూ 'గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు పెరిగాయి. తెదేపా శ్రేణులపై దాడులు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. మీ ఆదేశాలతో చేస్తున్న బెదిరింపులకు మేం భయపడం' అని స్పష్టంచేశారు. ఈ సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తుల సెల్‌ఫోన్లను పోలీసులు లాక్కొని, వాటిలోని ఫొటోలు, వీడియోలు తొలగించారు.