శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (09:45 IST)

నా ఫోన్ కూడా ట్యాపింగ్‌లో ఉన్నట్టు అనుమానం కలుగుతుంది : పీడీపీ ఎమ్మెల్సీ

vitapu-balasubrahmanyam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిపేస్తుంది. అధికార వైకాపా పార్టీ తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సమాచారం. దీంతో ఆయన వైకాపా అధినాయకత్వంపై తిరుగుబాటు చేశారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తుందని, దీంతో 12 సిమ్ కార్డులు మార్చాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో శానసభ మాజీ ప్రొటెం స్పీకర్, పీడీపీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చేరారు. ప్రస్తుత పరస్థితులు చూస్తుంటే తన ఫోన్ కూడా ట్యాపింగ్‌లో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని కోటంరెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతుందన్న అనుమానాలు తనకు కూడా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుందని ఎమ్మెల్సీ విఠపు అభిప్రాయపడ్డారు.