గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (11:36 IST)

నా ఫోన్ ట్యాప్ చేశారు.. వైకాపా టిక్కెట్‌పై పోటీ చేయను : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

komatireddysridhar reddy
గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉన్నాను.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానించాను. అలాంటిది నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. నన్ను అవమానించిన చోట నేను ఉండను. ఆ పార్టీ టిక్కెట్‌పై కూడా నేను పోటీ చేయను అని నెల్లూరు రూరల్ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి ఆధారాలను బుధవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 9849966000 నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ఇది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నంబర్. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని నన్ను ఆయన ప్రశ్నించారు. నా స్నేహితుడితో మాట్లాడిన ఆడియోను ఆయన నాకు పంపించారు. ఆధారాలు లేకుండా నేను మాట్లాడను. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదా, ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేతో ఆగదు. మంత్రులు, న్యాయమూర్తులు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు విలేఖరులు, మీడియా యాజమాన్యాలు ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేస్తారు. దీనికి ఎవరైనా అంగీకరిస్తారా? 
 
వైఎస్ ఫ్యామిలీతో మూడు దశాబ్దాలుగా అనుబంంధం ఉంది. సీఎం జగన్‌ను ఎంతగానో అభిమానించా. అవమానాలు ఎదురైనా పార్టీ కోసం పని చేశా. నన్ను అవమానించిన చోట ఇక నేను ఉండకూడదని నిర్ణయించుకున్నా... వచ్చే ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేయను. నాకు నటన చేతకాదు. మోసం చేయడం రాదు. నా ఫోన్ ట్యాపింగ్చేసి నా మాటలు దొంగచాటుగా విన్నారని తెలిసినపుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ, ఈ రోజు వరకు దాన్ని మవస్సులో దాచుకున్నా అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు.