శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (17:30 IST)

"వాల్తేరు వీరయ్య"లో రవితేజ గురించి ఒక్క మాట మాట్లాడని చిరంజీవి!

chiru - ravi
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య".. బాబీ దర్శకుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రం శృతిహాసన్ హీరోయిన్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అయితే, ఈ చిత్రం బృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో చిరంజీవి, రవితేజ, రాజేంద్ర ప్రసాద్‌, ఊర్వశి రౌతలాతో పాటు చిత్ర బృందం సభ్యులంతా పాల్గొన్నారు. 
 
ఇందులో చిరంజీవి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు. కానీ వేదికపై తన పక్కనే కూర్చొన్న రవితేజ గురించి మాట్లాడలేదు. ఇది వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై చిరంజీవి ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన చేశారు. 
 
ప్రి రిలీజ్ ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రెస్మీట్‌లో చాలా తక్కువగా మాట్లాడాలని అనుకున్నానని, ఈ క్రమంలోనే రవితేజ గురించి చెప్పడం మిస్సయ్యానని వివరణ ఇచ్చారు. ప్రెస్మీట్ ముగిసిన తర్వాత తిరిగి వెళుతుంటే రవితేజ గురించి మాట్లాడకపోవడాన్ని ఎంతో లోటుగా ఫీలయ్యాయనని తెలిపారు. అందుకే ట్విట్టర్‌లో స్పందించానని తెలిపారు. 
 
"వాల్తేరు వీరయ్య ప్రాజెక్టు గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో నటిస్తున్నాంటూ రవితేజ వెంటనే అంగీకరించారు. రవితో ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ షూటింగులో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించింది. షూటింగులో ప్రతి రోజూ స్పందించాను. వాల్తేరు వీరయ్యలో రవితేజ లేకపోతే ఈ సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయేది. డైరెక్టర్ బాబీ చెబుతున్నట్టుగా పూనకాలు లోడింగ్‌లో రవితేజ పాత్ర చాలా చాలా వుంది. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం" అని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు.