ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 29 జనవరి 2023 (14:31 IST)

తారకరత్నకు తాతగారు ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉంది.. జూనియర్ ఎన్టీఆర్

jr ntr
హీరో తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని హీరో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నను తన సోదురుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి చూశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తారకరత్నకు మా తాతగారైన దివంగత ఎన్.టి.ఆర్ ఆశీర్వాదం ఉందన్నారు. వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారని చెప్పారు. 
 
"తారకరత్న పోరాడుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాద తారకరత్నకు ఉంది. తాతగాలి ఆశీర్వాదం కూడా ఉంది. ఆస్పత్రిలో పడకపై ఉన్న తారకరత్నను వెళ్లి చూశా. వైద్యానికి ఆయన స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం తరపున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ ఎంతగానో సహకరించారు. ఆయనకు ధన్యవాదాలు" అని అన్నారు.