ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 8 జనవరి 2023 (17:54 IST)

నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' టీజర్ ఎలావుంది?

amigos
'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంతో రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఈ ట్రైలర్‌ను చూస్తే కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయం చేసినట్టు తెలుస్తుంది. ఒక పాత్రలో యంగ్ బిజినెస్‌మేన్ సిద్ధార్థ్, మరో పాత్రలో అమాయకమైన మంజునాథ్, మైఖేల్ అనే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను కూడా ఇందులో చూపించారు. 
 
ఈ టీజర్‌కు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించారు. ఇది పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. అషికా రంగనాథ్ హీరోయిన్. వచ్చే నెల పదో తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.